ఎం.ఎల్‌.ఏతో ఎం.ఎల్‌.సీ

కల్యాణ్‌ రామ్‌ ఈమధ్య ‘ఎం.ఎల్‌.ఎ’గా కనిపించాడు. ఆ సినిమా టైటిల్‌కి తగ్గట్టు.. కల్యాణ్‌ రామ్‌ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అంటూ అందరూ పొగిడేశారు. అది ఎంత నిజమో.. అల్లరి నరేష్‌ ఓ ‘ఎం.ఎల్‌.సీ’ అనేది కూడా అంతే నిజం. అంటే.. మంచి లక్షణాలున్న కమెడియన్‌ అన్నమాట. నరేష్‌ కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? కితకితలు పెట్టడం అనేది నాన్న నుంచి నేర్చుకున్న విద్య. దాన్ని ప్రతీ సినిమాలోనూ ప్రదర్శిస్తుంటాడు. నరేష్‌కి ప్రత్యేకమైన బ్రాండ్‌ తీసుకొచ్చింది ఆ నవ్వులే. అన్నట్టు ‘ఎంఎల్‌ఎ’లో కామెడీ బాగా పండింది. కల్యాణ్‌రామ్‌ తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందివ్వగలిగాడు. ‘మీ సినిమాలో కామెడీ బాగుందండీ..’ అంటూ ఆ సన్నివేశాలేవో గుర్తు చేసుకుంటూ.. నవ్వుల్లో పడిపోయాడు మన అత్తిలి సత్తిబాబు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.