అభినయమే అందం
కథానాయిక అంటే ‘గ్లామర్‌ డాళ్‌’ అని ఎవరన్నారు? అది పాతకాలం నాటి మాట. ఇప్పుడు ‘అభినయమే అందం’ అనే కొత్త సూత్రంతో వర్థిల్లుతోంది చిత్రసీమ. నిత్యామేనన్‌లాంటి బొద్దుగుమ్మలు కూడా తెలుగునాట రాణిస్తున్నారంటే దానికి కారణం... వాళ్ల ప్రతిభా పాటవాలే కారణం. నివేధా ధామస్‌ కూడా అభినయాన్నే నమ్ముకొంది. చూడ్డానికి బొద్దుగా ఉన్నా - కథానాయికల రేసులో తాను కూడా ముందుంది. ఆ పక్కనే ఉన్న షాలినీ పాండే కూడా అంతే. ‘అర్జున్‌ రెడ్డి’తో ఒక్కసారిగా మెరిసింది. ఆ సినిమాలో ఎడా పెడా ఎంగిలి ముద్దులిచ్చి రెచ్చగొట్టినా.. తన అస్త్రం కూడా అభినయమే. ఇద్దరూ కలసి ఇప్పుడో సినిమాలో నటిస్తున్నారు. ఆ కబుర్లలో ఉండగానే తీసిన స్టిల్‌ ఇది.© Sitara 2018.
Powered by WinRace Technologies.