స్మైలు స్మైలురా...

రాజశేఖర్‌లో బాగా నచ్చేది ఆయన నవ్వు. టూత్‌ పేస్ట్‌ యాడ్‌లోలా ఆయన నవ్వుతుంటే... లైట్లు వేయాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుంటుంది. ఆయన్ని యాంగ్రీ యంగ్‌ మెన్‌ అంటారు గానీ, ఆల్వేస్‌ స్మైలీమెన్‌ అని పిలిచినా తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే.. ఆయన కంటే ముందు ఆయన నవ్వే మనల్ని పలకరిస్తుంది. డాన్సు చేసినా, ఫైటు చేసినా.. ఇలా నవ్వుతూ ఉంటే.. అంతకు మించి ఇంకేం అక్కర్లెద్దు. ‘మీ నవ్వుకి నేనూ పోటీనే’ అన్నట్టు అడవి శేష్‌ కూడా నవ్వుల యుద్ధం ప్రకటించేశాడు. రాజశేఖర్‌ కుమార్తె శివానీ కథానాయికగా పరిచయం అవుతున్న ‘టూ స్టేట్స్‌’లో అతనే హీరో. ‘మీ అమ్మాయి కూడా మీలానే అండీ.. ఇలా నవ్వుతూనే ఉంటుంది’ అంటూ నవ్వుతూ చెబుతుంటే.. రాజశేఖర్‌ మాత్రం ఇలా నవ్వకుండా ఎలా ఉంటారు..?


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.