మెగా మంతనాలు ఎందుకో...?

పవన్‌ కల్యాణ్‌ని ఇప్పుడో సినిమా స్టార్‌గానే చూడలేం. ఆయనో ప్రజా జీవి. ఇటీవల సినిమావాళ్లతో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్నారు. అడపా దడపా సినిమా ఫంక్షన్లలో మెరుస్తున్నారు. ఇది వరకు ఆయన్ని కదిపితే సినిమా కబుర్లు వినిపించేవేమో. ఇప్పుడు అలా కాదు. ప్రజల సాధక బాధకాలు ఆయన గళంలో ప్రతి ధ్వనిస్తుంటాయి. మెగా కుటుంబంలో మిగిలిన కథానాయకులకు రాజకీయంతో అంతో ఇంతో టచ్‌ ఉంది. ‘ప్రజారాజ్యం’ సమయంలో మెగా కుటుంబం అంతా క్యాంపెయినింగ్‌ చేసింది. ఇప్పుడు ‘జనసేన’ వంతు వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ‘జనసేన’ బలం పుంజుకోవాల్సిన సమయం వచ్చేసింది. మరి బన్నీ తోడుంటాడా? ప్రస్తుతం జనంలో అదే ప్రశ్న మెదులుతోంది. ఈ ఫొటో చూస్తే... ‘బన్నీ బలం కూడా తోడైంది’ అనిపిస్తోంది. మరి వీళ్ల మనసులో ఏముందో?


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.