బాణీ.. కహానీ

తమన్‌ సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. ఇది వరకు బీట్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే తమన్‌.. ఇప్పుడు హార్ట్‌ ‘బీట్‌’ కూడా స్పందించేంత మధురమైన మెలోడీలు అందిస్తున్నాడు. ఫాస్ట్‌ బీట్‌కి ఎవరైనా పాటలు రాసేయొచ్చు. బాణీ హోరులో, పదాలు అర్థం కానప్పుడు ఎవరు రాస్తే ఏంటి? అయితే ఇప్పుడు అలా కాదు. తమన్‌ పూర్తిగా మెలోడీనే నమ్ముకున్నాడు. అలాంటప్పుడు ప్రతీ పదం మనసుని తాకాలి. కొన్ని పాటల్ని పదాలే నడిపించాలి. అలాంటప్పుడు గీత రచయితతో ఇంకాస్త మమేకం అవ్వాలి. తన సౌండింగ్‌కి తగిన పదాల్ని అడిగి మరీ సమకూర్చుకోగలగాలి. ప్రస్తుతం తమన్‌ అదే పనిచేస్తున్నారేమో. గీత రచయిత కమ్‌ దర్శకుడు తో ఇలా డీప్‌ డిస్కర్షన్‌లో పడ్డారంటే, అది కచ్చితంగా మెలోడీ పాట కోసమే అయ్యుంటుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.