బాధలు మరిచి బాధ్యతల్ని గుర్తుచేసే పాట


నా
కు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ఏ పాటా మిస్‌ అవ్వను. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. ఆయన సాంగ్స్‌ వింటుంటే తెలియని ఉత్సాహం వస్తుంది. కథకు తగినట్లు నేపథ్య సంగీతం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఇప్పటికి ఎన్ని పాటలు అందించినా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలోని ‘చల్‌ చలో చలో’ పాట ఎప్పటకీ మరిచిపోలేను. ఎందుకంటే.. కుటుంబ పరిస్థితులు సరిగా లేనపుడు కథానాయకుడు తనేంటో తాను తెలుసుకుని జీవితంలో ముందుకెళ్లాలనే సందర్భంలో వస్తుందీ పాట. బాధలు మర్చిపోయి బాధ్యతల్ని గుర్తుచేసేలా ఉంటుంది. మధ్య తరగతి యువకులను ప్రతిబింబిస్తుంది. జీవితంలో ఏదైన సాధించాలనుకునే యువతకు ఈ పాట స్ఫూర్తినిస్తుంది. సాహిత్యానికి ఇందులో పెద్ద పీట వేశారు. ‘రాజ్యం గెలిచినోడు రాజవుతాడు.. రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు’ అనే పదాలతో ప్రారంభమయ్యే ఈ పాట ఆద్యంతం ఆలోచింపజేస్తుంది. సంగీతం, సాహిత్యం సమపాళ్లలో ఉంటే ఎలా ఉంటుందో ఈ పాట ఉదాహరణగా చెప్పొచ్చు.

-అనంత శివరామకృష్ణ, గురుభట్లగూడెం, పశ్చిమ గోదావరి


                           


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.