మానవత్వాన్ని తట్టి లేపే పాట ఇది
        '..మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పని యేనా..' అనే పాట అప్పటికి ఇప్పటికి ఎప్పటికి సమకాలిన సమస్యలకు దర్పణం గా నిలిచిన పాట అందుకే అది నాకు చాలా ఇష్టం. 


సినిమా పేరు: నేరం నాదికాదు ఆకలిది  (తారాగణం: N.T.రామారావు, మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి, సంగీత దర్శకత్వం: సత్యం, రచన: సి.నారాయణరెడ్డి  గానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం .
  
  
                               



పల్లవి::
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::1
కత్తితో చేధించనిది కరుణతో..చేధించాలి
కక్షతో కానిది క్షమాభిక్షతో..సాధించాలి
తెలిసీ తెలీయక కాలు జారితే..ఏ..ఏ..ఏ..ఏ
తెలిసీ తెలియక కాలు జారితే..చేయూతనిచ్చి నిలపాలీ
మనలో కాలు జారని వారు..ఎవరో చెప్పండి
లోపాలు లేని వారు..ఎవరో చూపండి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::2
గుడులలో లింగాలను మింగే..బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే..మహా వ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చేసే..ఏ..ఏ..ఏ..ఏ
ఆకలి తీరక నేరం చేసే..అభాగ్యజీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::3
తప్పు చేసిన ఈ దోషిని..ఇప్పుడే శిక్షించాలి
మరపురాని గుణపాఠం..పదిమందిలో నేర్పించాలి
హ..హ..హ..ఐతే
ఎన్నడు పాపం చేయని వాడు..ఊ..ఊ..ఊ
ఎన్నడు పాపం చేయని వాడు..ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వాడే..ఆ రాయి విసరాలి
ఏ లోపం లేని వాడే..ఆ శిక్ష విధించాలి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి

పంపినవారు:దార్ల శ్రీనువాసులు ఆచారి, నాగిరెడ్డి పల్లె (గ్రామం),నందలూరు (మండలం),కడప(జిల్లా),సెల్ :8341230877.

మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా:
 sitaradesk@sitara.net


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.