హృదయాన్ని హత్తుకునే మెలోడి

నాకు మెలోడి పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఇలాంటి పాటలు ఎన్ని విన్నా.. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. గోపీ సుందర్‌ సంగీతమే ఇందుకు కారణం. సినిమా ఆరంభంలోనే వస్తుందీ పాట. సాధారణంగా టైటిల్‌ సాంగ్స్‌ ఫాస్ట్‌ బీట్‌, మాస్‌ నంబర్‌గా ఉంటుంటాయి. అయితే ఇదొక సెన్సిబుల్ లవ్‌ స్టోరీ కావడంతో దానికి తగినట్లు బాణీలు అందించడంలో రచయిత విజయం సాధించారు. ఈ పాట ఆలపించిన గాయకుడు అరుణ్‌ గోపాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన వాయిస్‌ ఈ పాటకు హైలెట్‌గా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మధ్యలో వచ్చే కోరస్‌ హృదయాన్ని హత్తుకుంటుంది. ప్రేమికుడు ప్రేయసి గురించి పాడుకునే ఈ పాట చిన్నదే అయినా అందులోని భావం చాలా పెద్దది. రోజులో ఒక్కసారైనా ఈ పాటను హమ్మింగ్‌ చేయకుండా ఉండలేను.


నిన్ను కోరి నిన్ను కోరి
కదిలే నదిలా కరిగా కన్నులా
నిన్ను కోరి నడిచే ప్రతి దారి
నిన్ను కోరి ఎగసే నా ఊపిరి

చెలియా ఓ సఖియా నిన్ను కోరి
ఓ చెలియా ఓ సఖియా నిన్ను కోరి
చెలియా...



-పుసులూరి వీరేంద్ర బాబు,నేలకొండ పల్లి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.