ప్రభాస్‌ హీరోయిజంలో.. ఆ ఒక్క అడుగు

నాకు ప్రభాస్‌ అంటే చాలా అభిమానం. ఆయన తొలి సినిమా ‘ఈశ్వర్‌’లో నటనకు ఫిదా అయ్యాను. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అలరించాయి. కానీ, పుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్న తరుణంలోనే ‘ఛత్రపతి’గా వచ్చి సందడి చేశాడు. ఆ సినిమాలోని ఒకే డైలాగ్‌తో తన హీరోయిజాన్ని చూపించాడు. పోర్టు ఏరియాలో బతికుతున్న వాళ్లని ఇబ్బంది పెట్టే అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు) దగ్గరకు వచ్చి తమ జోలికి రావద్దంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌ వింటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఇందులో అన్యాయాన్ని ఎదురించే ఓ యోధుడిలా కనిపిస్తాడు ప్రభాస్‌. రోజులో ఒక్కసారైనా ఈ డైలాగ్‌ వినాల్సిందే. అంతగా నన్ను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు గడిచిన సందర్భంగా.. ఆ సన్నివేశం గుర్తుచేసుకుంటూ...


ఎవడోఒకడి కింద బతకడం తప్ప మాకు బతకడం రాదన్నావ్‌. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వొస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్టు ఏరియా. నా వాళ్లు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లిపుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు.. వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే... అప్పలనాయుడు దాదా గిరికొచ్చినా.. దౌర్జాన్యానికొచ్చినా.. గూండాయిజానికొచ్చినా.. గ్రూపులు కట్టడానికొచ్చినా... పూటకో శవం లెక్కన పోర్టుకు బలవుతాయ్‌. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయ్‌’’.


-సంజయ్‌ సాహు, ఏలూరు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.