నైతిక విలువలకు అద్దం...
నైతిక విలులకు పెద్దపీట వేసిన చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. ఈ చిత్రం అంటే నాకెంతో ఇష్టం. సినిమాలో హీరో తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. ఆయన చేసిన అప్పులు తీర్చడం నీపని కాదని పైడా సాంబశివరావు (రాజేంద్రప్రసాద్‌) హీరో అల్లు అర్జున్‌కు సలహా ఇస్తాడు. ‘కోర్డులో దివాళా పిటిషన్‌ దాఖలు చేసేయ్‌. రూ.300 కోట్లుతో హాయిగా బ్రతకొచ్చు’ అంటాడు. ‘మా నాన్న అప్పులు చేసి చనిపోయినా వాటిని తీర్చాల్సిన బాధ్యత నాపైన ఉంది. వాటికి జవాబుదారీగా నేనుంటాను’ అంటాడు హీరో. ‘మా నాన్న నాకు నేర్పిన నైతిక విలువల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టలేను’ అని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతాడు. ఈ సన్నివేశంలో విలువలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రతి మనిషికి ఉండాల్సిన బాధ్యతను, విలువల్ని గుర్తుచేశారు. ఆ సన్నివేశం చూస్తున్నంతసేపూ ఉద్వేగ భరితంగా ఉంటుంది. ఇటువంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం. డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఇటువంటి సినిమాలను మరెన్నో తీయాలి.

- ఆర్‌ ప్రవీణ్‌ కుమార్‌, తుని (తూ.గో.)మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా: sitaradesk@sitara.net


© Sitara 2018.
Powered by WinRace Technologies.