ఎటో వెళ్లిపోయింది మనసు
నాగార్జున, టబూ జంటగా నటించిన ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో. ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. నాగ్‌, టబూల మధ్య సున్నితమైన ప్రేమ సన్నివేశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారిందులో. ఇందులో ఓ సన్నివేశమంటే నాకు మరీ ఇష్టం. నాగార్జున ఓసారి టబూని పైలెట్‌ శిక్షణ కోసం తీసుకువెళ్లినప్పుడు ఆమె విమానం ఎక్కేందుకు భయపడుతుంది. అప్పడు నాగార్జున భయం పోయేలా ఆమెకు ధైర్యం చెబుతాడు. సరదాగా ‘పండు పండు’ అంటూ టబూని ఏడిపించే సన్నివేశాలు బాగుంటాయి. రెండు కుటుంబాల మధ్య అవగాహన, ప్రేమికుల మనోభావాలను వ్యక్తపరిచే సందర్భాలను దర్శకుడు కృష్ణవంశీ ఆద్భుతంగా తెరకెక్కించాడు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు.. ఎటెళ్లిందో అది నీకు తెలుసు’ అంటూ సాగే ప్రేమగీతం ఎంతో ఇష్టం. సందీప్‌చౌతా అందించిన సంగీతం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

- ఆదిత్యకుమార్‌, గుంటూరు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.