కాజోల్‌ మాటలలో... అతిలోక సుందరి

తిలోక సుందరి శ్రీదేవి అంటే అందరికి అభిమానమే. ఆమె నటనకి, గ్లామర్‌కి ఆకర్షితులవ్వని సినీ ప్రక్షకులు ఉండరు. చిత్ర పరిశ్రమపై కథానాయికగా, నటిగా అంతటి ప్రభావాన్ని చూపింది ఆమె. ప్రస్తుతం ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమెను తలచుకోవటానికి ఇంకా చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఆమె జీవిత చరిత్రని పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ‘శ్రీదేవి : ది ఎటెర్నల్‌ స్క్రీన్‌ గాడెస్‌’ అనే పేరు పెట్టారు. ఈ పుస్తకావిష్కరణ ప్రముఖ నటి దీపికా పదుకొణె, శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ చేతుల మీదుగా జరిగింది. ప్రముఖ రచయిత సత్యార్థ్‌ నాయక్‌ ఈ జీవిత చరిత్రని రచించారు. పెంగ్విన్‌ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ముందుమాట రాయటం మరో విశేషం. ‘ఐకాన్‌ శ్రీదేవి గారి నటనా, జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్‌...’ ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు కాజోల్‌. అతిలోక సుందరి చిన్నతనం నుంచి అగ్ర కథానాయికగా ఎదిగే క్రమంలో ఆమె ఎదురొ ్కన్న పరిస్థితులు, ఆమె వ్యక్తిగత, సినిమాలకి సంబంధించిన ఆసక్తికర విషయాలు రచయిత సత్యార్థ్‌ నాయక్‌ వివరంగా పుస్తకంలో పొందుí రిచారని సమాచారం. ఈ పుస్తకంపై అతిలోక సుందరి అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.