నిజమైన తుపాకీతో తిప్పలు పడ్డ కంగనా!!

‘మణికర్ణిక’ కోసం కదన రంగంలో శత్రువులపై కత్తులు దూసిన కంగనా రనౌత్‌.. ఇప్పుడు ‘ధాకడ్‌’ కోసం తుపాకీ చేతబట్టింది. రక్తం రుచి మరిగిన ఆడ చిరుతలా విలన్‌ గ్యాంగ్‌ మొత్తాన్ని తన తుపాకీతో తూట్లు తూట్లుగా కాల్చిపారేస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో కంగనా యాక్షన్‌ హంగామాను శాంపిల్‌గా రుచి చూపించేశారు. అయితే తాజాగా ఈ టీజర్‌లోని సన్నివేశంకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది కంగనా. ‘‘టీజర్‌లో మేం ఉపయోగించినది నిజమైన తుపాకీనే. అది చాలా బరువుగా ఉంటుంది. చిత్రీకరణ సమయంలో ఆ తుపాకీని ఒక్కదాన్ని పైకెత్తడానికి నా శక్తినంతా కూడగట్టుకోవాల్సి వచ్చేది. అలా నేను ఆ తుపాకీతో కుస్తీ పడుతుంటే దర్శకుడు చూసి నవ్వుకునేవారు. ఇకనైనా డమ్మీ తుపాకీతో చిత్రీకరణ జరిపించాలని ఆశిస్తున్నా (నవ్వుతూ)’’ అంటూ తన పాత్ర కోసం పడిన కష్టాన్ని చెప్పుకొచ్చింది ఫైర్‌బ్రాండ్‌. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్‌ ఘాయ్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.