హాలీవుడ్‌ చిత్రాన్ని తిరస్కరించిన ఐశ్వర్యరాయ్‌!
అందాల సుందరి ఐశ్వర్యరాయ్‌కి తొలుత హాలీవుడ్‌ నుంచి ఓ చిత్రంలో చేయాలని పిలుపొచ్చిందట. ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన దర్శకురాలు గురిందర్‌ చద్దా తీస్తున్న ‘బ్రైడ్‌ అండ్‌ ప్రీజుడైస్‌’ చిత్రంలో చేస్తోంది. గ్రీకు యుద్ధ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్‌ ‘ట్రోయ్‌’ చిత్రంలో బ్రిసెస్‌ అనే యువరాణి పాత్రలో ఐశ్వర్య కనిపించాల్సింది. ఆ చిత్రంలో కొన్ని దృశ్యాలు మరీ సన్నిహితంగా ఉండడంతో, ఐశ్వర్య కొంత తటపటాయిందంట. అలా హాలీవుడ్‌ అందాల హీరో బ్రాడ్‌పిట్‌తో నటించే అవకాశాన్ని వదులుకుంది. యుద్ధవీరుడు అచెల్లీస్‌గా బ్రాడ్‌పిట్, హెలెన్‌ పాత్రలో డైనీ క్రుగెర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం మీద గ్రీకు చారిత్రక చిత్రంలో నటించే అవకాశం ఐశ్వర్య తృటిలో జారవిడుచుకుందన్న మాట. ఆ తరువాత హాలీవుడ్‌లో వచ్చిన ‘ది మిస్ట్రీస్‌ ఆఫ్‌ స్పైస్‌’, ‘ప్రొవోక్‌డ్‌’, ‘ది లాస్ట్‌ లెజియన్‌’, 2009లో ‘ది పింక్‌ ఫాంథర్‌2’లో నటించి అలరించింది. గత ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన చిత్రం ‘ఫన్నే ఖాన్‌’లో (2018) సుమిత్రా సింగ్‌ పాత్రలో నటించి మెప్పించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.