పిల్ల చిన్నది.. బరువు పెద్దది!

దర్శకుడు మహేష్‌భట్‌ కూతరుగా సినీ రంగప్రవేశం చేసిన నటి అలియాభట్‌. క్రమక్రమంగా ఆ పేరును పక్కకు నెట్టేసి తనదైన శైలిలో నటిస్తూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది అలియా. అలియాను చూస్తే చాలా చిన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ఎత్తే బరువును చూస్తే మాత్రం ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. నాజూగ్గా పెరిగిన అలియా సినిమాల్లోకి వచ్చాక వ్యాయామం చేస్తూ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అలియా డెభ్బై కేజీల డంబెల్స్‌ను అవలీలగా ఎత్తేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతంలో 20 కేజీల బరువుతో ప్రారంభించిన డెంబిల్స్‌ క్రమక్రమంగా 50, 60, ఇప్పుడు 70 కేజీల డంబెల్స్‌ను బరువులు ఎత్తుతూ సత్తా చూపుతుంది. ప్రముఖ ఫిజికల్‌ ట్రైనర్‌ సోహ్రాబ్‌ ఖుష్రుషాహి ఆధ్యర్వంలో శిక్షణ తీసుకుంటుంది అలియా. అలియా బరువులను ఎత్తడం గురించి సోఫిట్‌ ఫిట్‌నెస్‌ సంస్థ అలియా గురించి..‘‘మేం మొదట చాలా తక్కువ బరువుతో ఆమెకు శిక్షణ ఇచ్చాం. ఎందుకంటే అప్పుడు కొంచెం సన్నగా ఉంది. కానీ ఈ రోజు డెభై కేజీల డంబెల్స్‌ బరవును ఒక్కసారి పైకి లేపమని చెప్పాం కానీ అలియా మమ్ములను ఆశ్చర్యాని గురిచేస్తూ ఏకంగా రెండుసార్లు చాలా అవలీలగా 70 కేజీల బరువును పైకెత్తేస్తుందని’’ సంస్థ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సోహ్రాబ్‌ ఇప్పటికే సినిమా వాళ్లకు చాలామందికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరించారు. అలియాభట్‌ ప్రస్తుతం తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో నటిస్తుంది. ఈ మధ్య ప్రతి కార్యక్రమానికి అలియాభట్‌ రిషికపూర్‌ ఇంటికి చాలా ఎక్కువగా వెళ్తుంది. అందులోనూ ఎక్కడికి వెళ్లిన రణ్‌బీర్‌ - అలియాలు కలిసే వెళ్తున్నారు. మొన్న అంబానీ ఇంట జరిగిన గణపతి ఉత్సవాల్లో ఈ ప్రేమజంç పాల్గొంది. వెంటనే కెమెరాలన్నీ వీరిపైనే ప్లాష్‌ లైట్లులతో పోటోల వర్షం కురిపించాయి.

View this post on Instagram

I’m going to give this star the credit she deserves. When she started off earlier this year - she hadn’t lifted weights too often in her life. It took a while to get her to start enjoying being strong - not skinny - strong! The first time she tried a deadlift, we used one single 20lb dumbbell and that wasn’t even 9 months back. A few weeks back she managed to get in 5 reps at 50 kgs and she rocked it. Today was lifting day and we felt we had the energy to push that weight a little higher. After a few warm up sets she cruised through 3 reps at 60kgs which was a personal best for her anyway (I missed a count and I got the stare). Next, we decided to push it even further and do just 1 rep at 70 kgs - knowing @aliaabhatt she decided to give me 2 for good measure. Love the fact that she just NEVER backs down from what’s put in front of her. New personal best done and now we’re going to try and smash it again, soon. What say? Stay the same @aliaabhatt - we’ve got a lot of work to do. #sohfit #bethebestyou #girlswholift #strongnotskinny

A post shared by SOHFIT (@sohfitofficial) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.