పిల్లల కోసం తపించిపోతున్న అలియా భట్‌!

అల్లరిపిల్ల అలియా భట్‌కి సినిమాలే కాదు చిన్నపిల్లలన్న చాలా ఇష్టం. వారి కోసం ఎదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుందట. అందుకే పిల్లలకు సంబంధించిన ‘ఆర్ట్‌ ఫర్‌ ది హార్ట్‌’ అనే పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఇది గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారుల సహాయర్థం కోసం పనిచేస్తుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అలియా మాట్లాడుతూ..‘‘చిన్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వారి స్వచ్ఛమైన మనసుకు ఎటువంటి తారతమ్యాలు ఉండవు. అందుకే ఇలాంటి హృద్రోగ చిన్నారులకు నా వంతు సహాకారాన్ని అందించాలనుకునే ఇక్కడ వచ్చాను. ఈ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌కి నిధులు సేకరణలో నేను కూడా భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చిన్నారుల కోసం ప్రతి ఒక్కరు సహాయపడాలని’’ చెబుతోంది. ప్రస్తుతం అలియా భట్‌ తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్రా’లో నటిస్తుంది. మరోపక్క సంజయ్‌ లీలా భన్సాలి కొత్త తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి’ పాత్రలో చేస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.