‘బద్లా’ టీజర్‌ వస్తోంది.
మితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘బద్లా’. సంజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. 2016లో కొరియన్‌ భాషలో విడుదలైన ‘కాంట్రాటియింపో’ సినిమాకి రీమేక్‌. రెడ్‌చిల్లీú,Ã అజురేలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను షారూఖ్‌ విడుదల చేశారు. టీజర్‌ విడుదల కాబోతోంది. మార్చి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా షారూఖ్, అమితాబ్‌కు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘అమితాబ్‌జీ.. మీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా. సిద్ధంగా ఉండండి’ అని సరదాగా ట్వీట్‌ చేశారు. ఇందుకు అమితాబ్‌ స్పందిస్తూ.. ‘ షారుక్‌ భాయ్‌.. పగ తీర్చుకునే సమయం దాటిపోయింది. ఇప్పుడు అందరికీ పగను పంచాల్సిన సమయం వచ్చింది (పోస్టర్లను ఉద్దేశిస్తూ)’ అని చమత్కరించారు. వీరిద్దరి ట్విటర్‌ చాట్‌ చూసిన తాప్సి.. ‘షారుక్‌ జీ.. పగ తీర్చుకుంటానని మీరు ఇలా అనడం తప్పు. ఎందుకంటే సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. ఇప్పుడు మీకు సినిమా నుంచి ఏదన్నా కావాలంటే.. ఈ పోస్టర్‌ తీసుకోండి. ఎందుకంటే ఈ పోస్టర్‌లో బచ్చన్‌ సర్‌ చాలా గొప్పగా కనిపిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.పోస్టర్లలో అమితాబ్, తాప్సి బాధపడుతున్నట్లుగా కనిపించారు. దానిపై ‘ప్రతిసారీ పగ తీర్చుకోవడం సరైంది కాదు. అలాగని ప్రతిసారీ క్షమించడం కూడా సరికాదు’ అని రాసున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.