నేనెవరి రూల్సూ పాటించను!
‘‘సినిమాల్లో చాలామంది కథానాయికలు ఉంటారు. కానీ అందరూ చిత్రసీమలో అవకాశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తుంటారు. కానీ నేను అలా ఉండలేను. ఎందుకంటే? నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది అంటోంది’’ బాలీవుడ్‌ నటి బిపాసా బసు. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘అధత్‌’. ఈ సినిమాకి సంబంధించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘‘నేను స్టార్‌ హోదా పోతుందని ఎప్పుడూ భయపడను. ఒక్క దానికి మాత్రమే నేను భయపడతాను అదే వ్యక్తిత్వం. వ్యక్తిత్వాన్ని నేనెప్పుడూ కోల్పోను. చిత్రసీమకు సంబంధించి కొన్ని రూల్స్‌ ఉంటాయి. వాటిని నేనెప్పుడూ ఖాతరు చేయను. ఎందుకంటే నా రూల్సు నాకు ఉన్నాయి. నేను పదిహేను సంవత్సరాల వయసులోనే మోడలింగ్‌ చేశాను. నా పందొమ్మిదో ఏటనే సినిమాలు చేయడం ప్రారంభించా. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశా. కానీ ఎప్పుడూ ఎక్కడా రాజీపడలేదు. ‘జిస్మ్‌’, ‘రాజ్‌’ చిత్రాల్లో నేను బోల్డ్‌ పాత్రలు చేశా. కానీ వ్యక్తిగతంగా నేను అంత బోల్డ్‌ కాదు’’ అంటూ సెలవిస్తోంది. ‘‘ఇంతవరకు చాలా కాలం నుంచి సినిమాల్లోనే జీవితం గడిపాను. ఇప్పుడు మిగిలిన సమయాన్ని నా కుటుంబం కోసం వెచ్చిస్తా’’నని చెబుతోంది. నటుడు కరణ్‌సింగ్‌ గ్రోవర్‌తో పెళ్లి అయిన తర్వాత అతడితో ఆమె నటిస్తున్న చిత్రం ‘అధత్‌’ కావడం విశేషం.



సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.