హరివిల్లుపై మెరుపు తీగలు

ఎంతమంది భామలు కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై నడిచినా ఐశ్వర్యరాయ్‌ నడిస్తే ఆ అందమే వేరు... ఇలాగే సంబరపడిపోతుంటారు ఐశ్వర్యరాయ్‌ అభిమానులు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక్కో ఏడాది ఒక్కోలా... మైమరపించేలా ముస్తాబై కేన్స్‌ ఎర్రతివాచీపై కొత్త వెలుగులు పూయిస్తుంది ఐశ్వర్య. ఈ ఏడాది కేన్స్‌ వేడుకలో పాల్గొన్న తొలిరోజు నేరేడుపండు రంగు సీతాకోకచిలుక గౌనులో కనువిందు చేసింది. ఈ గౌనులో ఐశ్వర్యని చూసి ‘సీతాకోకమ్మా...సీతాకోకమ్మా’ అంటూ అభిమానులు సంబరంగా మురిసిపోయారు. ఇప్పుడు రెండో రోజు అందాల రాజకుమారిలా తళుకులీనింది. తొలి రోజు వావ్‌ అనేలా ఉంటే రెండో రోజు క్రిస్టల్స్‌ పొదిగిన ఈ గౌనులో సింపుల్‌గా చాలా క్లాసీగా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సింక్‌ ఆర్‌ స్విమ్‌’ చిత్రాన్ని తిలకించడానికి వచ్చినప్పుడు రెడ్‌కార్పెట్‌పై ఇలా మెరిసిపోయింది ఐశ్వర్య. కేన్స్‌ వేడుకల్లో సోనమ్‌కపూర్‌తో పాటు పలువురు హాలీవుడ్‌ భామలు చిత్రవిచిత్రమైన గెటప్పుల్లో ఎర్రతివాచీపై సందడి చేశారు. ఈ వేడుకకు తన కూతురు ఆరాధ్యను వెంటబెట్టుకొచ్చింది ఐశ్వర్య. ఆరాధ్య బుల్లి రాజకుమారిలా ముస్తాబైంది. ఉప్పొంగిన ప్రేమతో ఇదిగో ఇలా కూతుర్ని ముద్దాడుతోంది ఐశ్వర్య.© Sitara 2018.
Powered by WinRace Technologies.