తిరుపతికి రానున్న దీపికా - రన్వీర్‌సింగ్‌!

బాలీవుడ్‌ దంపతులైన దీపికా పదుకొణె - రన్వీర్‌సింగ్‌ల పెళ్లై సంవత్సరం కావస్తుంది. ఈ సందర్భంగా ఈ యువ జంట తమ మొదటి వివాహ వేడును కలియుగదైవం కొలువైన తిరుమల తిరుపతిలో, సిక్కు దేవాలయం అయిన అమృతసర్లోని గోల్డెన్‌ టెంపుల్‌లో జరపుకోనున్నారు. నవంబర్‌ 14న తిరుపతి, 15న అమృతసర్‌ దేవాలయంలో ప్రార్ధనలు చేయనున్నారట. ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట గత సంవత్సరం నవంబర్‌ 14న ఇటలీలోని లేక్‌ కోమోలో కొంకిణి, సింథి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్లైయిన తరువాత ఈ దంపతులు వివిధ సందర్భాల్లో ఒకరి గురించి చెప్పుకున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యతని తెలిపింది. ఓ సందర్భంలో దీపికా రన్వీర్ గురించి మాట్లాడతూ.. పెళ్లికి ముందు తరువాత ఆయనలో చాలా మార్చు వచ్చింది. కొన్సి సార్లు వృత్తి ధ్యాసలో పడి పొద్దుపోయాక ఇంటికి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు నేను లేచి, తిన్నాడా లేదా అని చూసుకుంటాను అంటూ.. చెప్పింది. ఇక రన్వీర్‌ కూడా దీపికా గురించి కూడా చాలా మంచి విషయాలే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.