ముదస్సార్‌ ప్రేమలో హుమా ఖురేషి!

బాలీవుడ్‌ నటి హుమా ఖురేషి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బొద్దుగా, ముద్దుగా ఉన్న హుమా ప్రస్తుతం దర్శకుడు ముదస్సార్‌ అజీత్‌తో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకుంది. సెప్టెంబర్‌5న ముదస్సార్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా హుమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముదస్సార్‌ విభన్న రకాల ఫోటోలను పెట్టింది. వాటికి తనదైన రీతిలో..‘‘ముదస్సార్‌ మీరు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడుతున్నా. మీలో ఎన్నో భావాలు ఉండవచ్చు..మీ కలలన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా..ఎప్పుడూ నవ్వుతూ..ఉండండి..’’ అంటూ రాసకొచ్చింది. మొత్తం మీద తన ప్రేమను ముదస్సార్‌ పుట్టినరోజు తెలియజేసిందన్న మాట. ఆ మధ్య రజనీకాంత్‌తో కలిసి ‘కాలా’ చిత్రంలో జరీనాగా, కాలా మాజీ ప్రేయసిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం జాక్‌ సిండర్‌ దర్శకత్వంలో హాలీవుడ్‌ చిత్రం ‘ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌’ చిత్రంలో నటిస్తుంది. హుమా ప్రియుడు ముదస్సార్‌ రచయితగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫెడ్నేకర్లలు నటిస్తున్న ‘పతి పత్ని ఔర్‌ హో’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Huma Qureshi (@iamhumaq) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.