హిందీ ‘జెర్సీ’ కథానాయిక తనే

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాని నటించిన ‘జెర్సీ’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. నాని పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఇప్పటికి వరకు కథానాయిక ఎవరో చెప్పకుండా సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది చిత్ర బృందం. తాజాగా షాహిద్‌ సరసన కనిపించబోయే నాయికను ప్రకటించింది.‘సూపర్‌ 30’, ‘బట్లాహౌజ్‌’ చిత్రాల ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టబోతుంది. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తెలుగులో విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరినే రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్‌ గిల్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం 2020 ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.