సోదరిమణుల ప్రేమ..!

ప్రముఖ బాలీవుడ్‌ సుందరి జాన్వీ కపూర్, తన సోహోదరి షానయ కపూర్‌లు అప్పుడుప్పుడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా దగ్గరగా ఉంటారు. తమకు సంబంధించిన చాలా విషయాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సందడి చేస్తూ ఉంటారు. షానయ కపూర్‌ ఎవరో కాదు బోనీ కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ కూతురే. జాన్వీ ‘ధడక్‌’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయగా, షానయ ఇంకా బాలీవుడ్‌లో ఏ చిత్రంలోనూ నటించలేదు. జాన్వీ ప్రస్తుతం ‘కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి షానయ సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. షానయ ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్‌తో కలిసున్న ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. ఆ ఫోటో కింద..‘‘నా అందమైన సోదరి అని రాసింది. వెంటనే జాన్వీ కూడా ‘‘లవ్‌ యు’’ంటూ బుదలిచ్చింది. మొత్తం మీద అన్నదమ్ముల పిల్లలు ఇలా కలిసుండం చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం జాన్వీ, కార్తిక్‌ ఆర్యన్‌తో ‘దోసానా2’లో చేస్తుంది. మరో పక్క ‘రూహిఅప్జా’, కరణ్‌ జోహార్‌ చిత్రం ‘తఖ్త్‌’లోనూ కనిపించనుంది.



View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.