జాన్వీకపూర్‌ - ఇషాన్‌లు డేటింగ్‌లో ఉన్నారా!

ప్రముఖ బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ ‘ధడక్‌’ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌తో ఓ కార్యక్రమానికి హాజరైంది. ‘కబీర్‌సింగ్‌’ నటుడు షాహిద్‌ కపూర్‌ తన కుమారుడు జైన్‌ కపూర్‌ పుట్టినరోజు వేడుకను జరుపుకొన్నారు. ఈ వేడుకకి జాన్వీ కపూర్‌ కూడా హాజరైంది. అయితే జాన్వితో పాటు తన సహనటుడు ఇషాన్‌తో కలిసి వచ్చింది. అందుకే అక్కడున్న కొద్దిమంది మీడియా జనాలు వీరి ఫోటోలను క్లిక్‌మనిపించారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి ‘ధడక్‌’ చిత్రం నుంచి వీరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు మొదలుపెట్టారంట. మొత్తం మీద ఏదో తెలిసిన వ్యక్తి కదా అని కలిసి వస్తే వెంటనే వారిద్దరికి ముడి వేయడం సరికాదంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఇషాన్‌ - షాహిద్‌ కపూర్‌కి తమ్ముడు అవుతాడు. వేడుకకు వచ్చిన జాన్వీ చాలా సింపుల్‌ డ్రెస్‌తో హాజరైంది. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ యుద్ధ విమానఫైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా వస్తున్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ అనే చిత్రంలో నటిస్తుంది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శరణ్‌ శర్మ దర్శకుడు. మార్చి 13, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.