అబ్బ..‘రొమాంటిక్‌’లో మందిరాబేడీ
ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలు. ఈ చిత్రానికి పూరి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మందిరాబేడీని ఎంచుకున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ‘‘ఇదో అందమైన ప్రేమకథ. పూరి చిత్రాల్లో కథానాయకుడి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అదే తరహాలో ఆకాష్‌ పాత్ర సాగుతుంది. గోవాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. మందిర కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టింది’’ అని చిత్రబృందం తెలిపింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.