మాధురీ దీక్షిత్‌ రాజకీయ పాత్ర!
కథానాయికగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాధురీ దీక్షిత్, రాజకీయాల్లో కొత్త పాత్ర పోషించనుంది. ‘దిల్‌’, ‘రాజా’, ‘తేజాబ్‌’, హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’, ‘దిల్‌తో పాగల్‌ హై’ ‘దిల్‌’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు అభిమానాన్ని సంపాదించుకున్న మాధురి రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు సిద్థమౌతోంది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని పుణే నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం. ఇటీవల సంపర్క్‌ సమర్థన్‌లో భాగంగా మాధురి భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను కలుసుకున్నారు.



© Sitara 2018.
Powered by WinRace Technologies.