ఆ సమయంలో వచ్చే స్నేహితులు లేరు!

బాలీవుడ్‌ నటి మౌని రాయ్‌ గురించి ఇప్పుడిప్పుడే అందరూ మాట్లాడుకుంటున్నారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన కథానాయిక మౌని. ప్రస్తుతం ‘మేడ్‌ ఇన్‌ చైనా’ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌ సరసన వయ్యారాలుపోతుంది. సినిమాకి సంబంధించిన ప్రచార కారక్రమం ముఖాముఖిలో మౌని మాట్లాడుతూ..‘‘నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చే స్నేహితులు ఎవరు లేరు. ఎందుకంటే నేను రాత్రిపూట తొందరగానే నిద్రపోతాను. తొందరగా మంచెమెక్కుతాను..కోడి కూచే వేళకి మంచం దిగుతాను. కాబట్టి మూడు గంటలకు వచ్చే స్నేహితులు నాకు లేరు. నేనొక నియమం కూడా పెట్టుకున్నా. ముందుగా పడుకోవడం.. ఉదయాన్నే నిద్ర లేవడం..’’అంటూ చెప్పకొచ్చింది. మిఖిల్‌ మస్సేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మేడ్‌ ఇన్‌ చైనా’ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్, బొమన్‌ ఇరానీ, సుమీత్‌ వ్యాస్, అమైరా దస్తూర్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపావళి పండుగ రోజున ప్రేక్షకుల ముందకు రానుంది ఈ చిత్రం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.