అలియా - రణ్‌బీర్‌ల నిశ్చితార్థం?

బాలీవుడ్‌ ప్రేమజంట రణబీర్‌కపూర్, అలియా భట్‌ల నిశ్చితార్థం త్వరలోనే జరగనుందని సమాచారం. గత కొంతకాలంగా ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమకు పచ్చజెండా ఊపేశారు. ఇక నిశ్చతార్థం కూడా జూన్‌ మాసంలోనే ఉంటుందట. అయితే ఇప్పటీ వరకూ ఈ ప్రేమపక్షులు మాత్రం ఎక్కడా డేటింగ్‌ చేస్తున్నట్టు కానీ, ఇంకా ఇతర విషయాలు ఏమీ చెప్పలేదు. సినీ జనాలు మాత్రం, ఇరు కుటుంబాల సభ్యులు ఒకరి శుభకార్యాల్లో మరొకరు పాల్గొనడం చూసి వీరిద్దరి మధ్య బంధం బాగా అల్లకపోయిందని అనుకుంటున్నారు. దానికితోడు రణ్‌బీర్‌ - అలియాలు కూడా మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవడం లేదు. అంటే మౌనం అంగీకారమనే విషయాన్ని చెప్పకనే చెప్పారన్నమాట. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మస్తా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 20, 2019లో విడుదల కానుంది. అయితే రణ్‌బీర్‌ - అలియాలు మాత్రం కొంతకాలం ‘బ్రహ్మస్తా’ విడుదలయ్యే వరకు వేచి ఉంటే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.