ఈ ఉదయం కొత్తగా ఉంది కదా!

బాలీవుడ్‌ ప్రేమజంట ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లోనే కాదు వ్యక్తిగతంగాను బాగా ఫోకస్‌ అవుతున్నారు. అలియా భట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పెట్టింది. దానికి ..ఈ రోజు చాలా కొత్తగా ఉంది. అసలు ఉదయం అంతా ఇక్కడే ఉన్నట్లుంది. బహుశా కాంతి కూడా ఇక్కడే ఉండిపోతుందా..అంటూ పేర్కోంది. రణ్‌బీర్‌ కపూర్‌ - అలియాభట్‌లు కెన్యా వెళ్లినప్పుడు ఈ కొన్ని అందమైన ఫోటోలు తీశారంట. కెన్యా అరణ్యంలో అలియాభట్‌ ఫోటోలను తీసేందుకు రణ్‌బీర్‌ ఫోటోగ్రాఫర్‌గా మారాడు. ఇప్పుడు ఆ తీపి గురుతులను అలియా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటుంది. ఈ మధ్యేనే అంబాని ఇంట వినాయక చవితి రోజున గణపతి పూజ జరిగింది. ఆ పూజకి ఇద్దరు కలిసి హాజరయ్యారు. ఇక మీడియా మొత్తం వారిపైనే దృష్టి పెట్టింది. దాంతో అలియా కూడా వారి ఫోటోలకు పోజులిస్తూ హడావుడి చేసింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్ర్తా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా, మౌని రాయ్‌లు నటిస్తున్నారు. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Alia ?? (@aliaabhatt) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.