సైనాగా మారేందుకు పరిణీతి సాధన

బయోపిక్‌లో నటించటం అంటే అశమాషి కాదు. సదరు నటీనటుల హావభావాలు అచ్చంగా దింపేసి నిజంగా వాళ్లే చేశారా లేక మరోకరు నటించారా అన్న భ్రమను కల్పించాలి ప్రేక్షకులకు. అందులోనూ క్రీడాకారుల జీవితాలంటే అభినయంతో పాటు ఆట కూడా నేర్చుకోవాలి. అందుకు తగ్గట్టే బ్యాడ్మింటన్‌ అకాడమీలో చేరి చెమట చిందిస్తుంది పరిణీతి చోప్రా. సైనా నెహ్వాల్‌గా మారేందుకు కోర్ట్‌లో కఠోర సాధన చేస్తుంది. అందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. పరిణీతి ప్రాక్టీస్‌ను మెచ్చుకుంటూ ఆమెను ప్రోత్రహిస్తున్నారు నెటిజన్లు. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌తో పాటు, పుల్లెల గోపిచంద్, సానియా బయోపిక్‌లు కూడా తెరకెక్కుతున్నాయి. వీటిలో ఏది ముందుగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. ఈ బయోపిక్‌ని మరో పాన్‌ ఇండియా సినిమాగా విడుదుల చేయటానికి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.