మాటల్లో చెప్పలేము!

బా
లీవుడ్‌లో నాయికానాయకుల (స్నేహ) బంధాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి అనడంలో అతియోశక్తి కాదు. అందుకు నిదర్శనమే శిల్పాశెట్టి, సల్మాన్‌ఖాన్‌ల అనుబంధం. ఈ మధ్యే శిల్పా ఇంటికి సల్మాన్‌ వెళ్లి కలిశాడట. ఆ సందర్భంగా సల్మాన్‌ శిల్పా తల్లి సునందనశెట్టికి చెంపమీద ఒక పెక్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ..‘‘ఈ ముద్దును మాటల్లో వర్ణించలేము. ఒక ఆత్మీయ స్పర్శ, దీనికి పదాలు సరిపోవు. ఇది మా మధ్య ఉన్న స్నేహబంధం. ఓ యాభైమంది శత్రువులున్నా.. మనకు ఒక స్నేహితుడు మాత్రం ఒక్కడైనా ఉండాలి’’ అంటోంది. సల్మాన్‌ఖాన్‌ శిల్పాకు కుటుంబ స్నేహితుడు కూడా. శిల్పా, సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘ఔజర్‌’, ‘ఫిర్‌ మిలింగే’, ‘గర్వ్‌’, ‘షాది కరే పాస్‌ గయ యార్‌’లాంటి చిత్రాల్లో నటించింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.