ఆ తుపాకీ మోయలేకపోయేదాన్ని

కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఎక్కువ ప్రేమ కథలతోనే ప్రయాణం చేసింది బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌. రొమాంటిక్ నాయికగా.. బెస్ట్‌ డ్యాన్సర్‌గా నిరూపించుకుంది. కానీ, ఇప్పుడు ‘సాహో’తో తొలిసారిగా తనలోని యాక్షన్‌ యాంగిల్‌ను కూడా రుచి చూపించబోతుంది శ్రద్ధా. ఈ సినిమాతోనే ఆమె దక్షిణాదిలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని తన యాక్షన్‌ ఎపిసోడ్ గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలియజేసింది శ్రద్ధా. ‘‘తొలిసారి నన్ను నేను ఓ యాక్షన్ నాయికగా చూసుకోవడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. ఈ సినిమా కోసం తొలిసారి తుపాకీ కూడా పట్టుకున్నా. మొదట్లో గన్‌ పట్టుకోవడం కూడా సరిగా వచ్చేది కాదు. చూడటానికి అది చాలా చిన్నదిగా ఉన్నా.. మోస్తుంటే దాని బరువు తెలిసొచ్చేది. నా చిన్న మణికట్టుతో దాన్ని హ్యాండిల్‌ చేయడం కష్టంగా ఉండేది. ఇక ఫైర్‌ చేయాలంటే చేతులు వణికేవి. కానీ, రానురానూ నాకు ఆ తుపాకులు వాడటం బాగా అలవాటైపోయింది. కానీ, దీని వల్ల పోలీసులు వారి ఆయుధాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారు. వాటిని వాడటం వెనుక ఎంత కష్టమున్నది తెలిసొచ్చింది. వారి వృత్తిపై మరింత గౌరవం పెరిగింది’’ అని చెప్పొకొచ్చింది శ్రద్ధా.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.