‘దబాంగ్‌’ కోసం 30 కిలోలు తగ్గాను!

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఎలాంటి సంశయం లేకుండా మాట్లాడుతుంది. అచ్చం తన తండ్రి శత్రుఘ్న సిన్హాలాగే. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేదట. తన బరువు విషయంపై ఆ మధ్య ఓ ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ..‘‘నేను సినిమా పరిశ్రమకు రాకముందు తొంభై ఐదు కిలోలు ఉండేదాన్ని. నా తొలి చిత్రం ‘దబాంగ్‌’ కోసం ముఫ్పై కిలోలు తగ్గాను. అయినా కానీ కొంతమంది మీడియా వాళ్లు, చిత్రసీమకు చెందిన కొద్ది మాత్రం నేను లావుగా ఉంటానని కామెంట్లు చేసేవాళ్లు. నా పాఠశాల, కాలేజీ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో  సరైన అవకాశాలు దక్కేవి కావు. కారణం నేను కొంచెం లావుగా ఉండటమే. సల్మాన్‌తో ‘దబాంగ్‌’ సినిమా అనే సరికి చాలా కష్టపడి 30 కిలోలు బరువు తగ్గాను. అయినా తెరపై కొంచెం బొద్దుగానే కనిస్తాను. నేను నాజుగ్గా ఉండననే విషయం నాకు తెలుసూ. అయినా నేనేమి పెద్దగా బాధపడను’’ అంటూ చెప్పకొచ్చింది. ఆ మధ్య ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ప్రచారంలో అక్షయ్‌ కుమార్‌ను కుర్చీ నుంచి కిందకి తోసేసింది. వెంటనే తేరుకున్న అక్షయ్‌ - సోనాక్షివైపు అమాయకంగా చూస్తూ ఈ అల్లరి పిల్ల చేష్టలను సరదగా తీసుకున్నారు. ప్రస్తుతం సోనాక్షి - సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘దబాంగ్‌3’లో రజ్జో పాండే పాత్రలో నటిస్తుంది. అజయ్‌ దేవగణ్, సంజయ్‌దత్‌లతో కలిసి ‘భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’లో సుందర్‌బెన్‌ జీతాగా నటిస్తుంది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.