జీవితం ఇప్పుడే బాగుంది..

హాలీవుడ్‌ ఫ్యాషన్‌ భామ సోనమ్‌కపూర్‌కి పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత జీవితం మరింత బాగుందట. గత ఏడాది వ్యాపార వేత్త ఆనంద్‌ ఆహుజాతో సోనమ్‌ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ‘‘పెళ్లికి ముందు నా జీవితంలోకి కొత్త ఆనందం వచ్చి చేరింది. ఆనంద్‌ ఆహుజా లాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా దక్కిన వరం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకుమందు కంటే ఆనంద్‌ను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇద్దరు ఒకరి పనికి ఒకరు విలువనిస్తాం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఇద్దరి కోసం సమయం కేటాయిస్తాం. ప్రతి విషయాన్ని పంచుకుంటాం. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేకుండా జాగత్త్రపడుతున్నాం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడే ఆ దాంపత్యం బాగుంటుంది. ఆ రెండూ మా మధ్య ఉన్నాయి’’ అని తన వైవాహిక జీవితం గురించి గర్వంగా చెబుతుంది సోనమ్‌. ఆమె దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించిన ‘ది జోయా ఫాక్టర్‌’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.