నేను ధోని అభిమానిని..

సినీ ప్రేక్షకులందరూ శృంగారతార సన్నిలియోనీకి అభిమానులైతే, సన్ని లియోనీ మాత్రం క్రికెట్‌ ఆటగాడు ధోనికి అభిమానని అంటోంది. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ‘మీకు నచ్చిన క్రికెటర్‌ ఎవరని’ అడిగితే జవాబిస్తూ..‘‘ఇండియాలో నాకు ఇష్టమైన క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని. అతను చాలా క్యూట్‌గా ఉంటాడు. మా కుటుంబ మిత్రడు కూడా అంటూ’’ సమాధానం చెప్పింది. ఆపై తన కెరీర్‌ గురించి చెబుతూ ‘‘ప్రస్తుతం నేను రెండు బుల్లితెర షోలు నిర్వహిస్తున్నా. మరో పక్క నా సొంత ప్రొడక్షన్స్‌లో హిందీలో నిర్మిస్తూ, నటిస్తున్నాను. అంతేకాక దక్షిణాదిలో రెండు చిత్రాల్లో నటిస్తున్నా. ఊపిరి సలపనంతగా పనిలో నిమగ్నమైయ్యాను. నాకు నటించడం అంటేనే ఇష్టం. దర్శతక్వం ఆలోచన లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. సన్నీ తెరపై కనిపించక రెండు సంవత్సరాలు దాటిపోయింది. 2017లో తెలుగులో రాజశేఖర్‌ చిత్రం ‘గరుడవేగ’లో ఐటెమ్‌ భామగా చిందులేసింది. ఆ తరువాత హిందీలో ‘తారే ఇంతేజార్‌’లోనే సందడి చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.