తాప్సి రుసరుసలు!
‘‘నా వ్యక్తిగత జీవితాన్ని బయటికి తెలియకుండా ఉంచాలనుకున్నా. కానీ మీరు మాత్రం నన్ను వదలటం లేదు. ఇది నాకు నచ్చడం లేదు’’ అంటోంది కథానాయిక తాప్సి. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఓ సందర్భంలో మీడియా మీద ఇలా రుసరుసలాడింది. ‘‘నేనేమన్నా ఒక వ్యాపారవేత్తనో, క్రికెటర్‌నో పెళ్లిచేసుకోవట్లేదు, ఎవరితోను డేటింగ్‌ చేయట్లేదు. మీరు మాత్రం నాగురించి ఏవేవో రాస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి, జరుగుతున్నాయి. ముందు వాటి గురించి ఆలోచించడండి’’ అంటూ కోపగించుకుందట. ఆమె కొన్నాళ్లుగా బ్యాడ్మింటన్‌ ఆటగాడు, ఒలిపింక్‌ విజేత ‘మాతిస్‌ బోయ్‌’తో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలపైనే ఆమె అక్కసంతా. వీరిద్దరు కలిసి ముంబైలోని ఓ రెస్టారంట్‌లో బస చేయడాన్ని బట్టి ముంబై మీడియా కథనాలు చేసింది. తాప్సి ప్రస్తుతం ‘మన్మర్జియన్‌’ అనే చిత్రంలో నటిస్తుంది. సెప్టెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అభిషేక్‌బచ్చన్‌, విక్కీకౌశల్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: అమిత్‌ త్రివేది.© Sitara 2018.
Powered by WinRace Technologies.