బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌తో తాప్సి ప్రేమాయాణం

నటి తాప్సి ఈ మధ్య కొత్త చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె మిషన్‌ మంగళ్‌ చిత్రంలో నటించింది. అంతేకాదు షార్ప్‌షూటర్లు చంద్రో తోమర్ మరియు ప్రకాశి తోమర్ల బయోపిక్‌లోనూ నటిస్తుంది. అలాంటి తాప్పి ఒలింపిక్‌ రజత పతక విజేత అయినా మాథియాస్‌ బోయ్‌తో డేటింట్‌ ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై తాప్సి కూడా ఎప్పుడు ఎక్కడా బయట చెప్పలేదు. మిషన్‌ మంగళ్‌ చిత్రం ప్రచారం సమయంలో కూడా చాలామంది మీడియా వాళ్లు గుచ్చి గుచ్చి అడిగినా నోరు మెదపలేదు. కానీ అతను క్రికెటర్‌ కాదు, సినిమాకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. క్రీడా నేపథ్యం ఉన్నవాడు అంటూ సూచనగా చెప్పిందట. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి విందు వినోదాల్లో పాల్గొనే వారట. అయినా ఎప్పుడూ కెమెరా కంటికి చిక్కలేదు. తాప్సీ ప్రస్తుతం అనుభవ్ సిన్హా యొక్క 'తప్పాడ్'లో నవలా రచయిత, కవి అమృత ప్రీతమ్ పాత్ర పోషించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.