గురుద్వార్‌లో అమీర్‌ఖాన్‌

బాలీవుడ్‌ వైవిధ్య నటుడు అమీర్‌ఖాన్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. 1994లో హాలీవుడ్‌ తెరపైకి వచ్చిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే సినిమాకి ఇది రిమేక్‌. నవంబర్‌ 4, 2019న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రం కోసం అమీర్‌ ఖాన్‌ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సినిమా విజయవంతగా ముందుకు సాగాలని అమీర్‌ అమృతసర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ని సందర్శించారు. స్క్రిప్టును సిద్ధం చేసుకొన్న మొదటి నుంచి ప్రతి అంశాన్ని పరిశీలించడం అమీర్‌కి అలవాటు. పంజాబ్‌లోని దాదాపు 100 వేర్వేరు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ చేయనున్నారట. అమీర్‌ ఇప్పటికే చిత్రం కోసం ఇరవై కిలోల బరువు తగ్గారు. గతంలో కొన్ని చిత్రాల కోసం ఇలాంటి ప్రయోగాలు చేశాడు అమీర్‌. అతుల్‌ కులకర్ణీ కథను అందించగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాని 2020 క్రిస్మస్‌ పండుగ నాటికి తెరపైకి తీసుకురానున్నారట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.