ఆ కారు కొన్న మూడో వ్యక్తి అజయ్‌ దేవగన్‌

భారతదేశంలోనే అత్యంత విలువైన కారు కొన్న వ్యక్తిగా బాలీవుడ్‌ అగ్ర నటుడు అజయ్‌ దేవగన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఏ కారు అనే కదా మీ సందేహం. రోల్స్‌ రాయల్‌ కంపెనీకి చెందిన కలినన్‌ యస్‌.వి. మోడల్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ.6.95 కోట్లు. ఇండియాలో ఇప్పటికి వరకు ఈ కారును ఇద్దరు మాత్రమే కొన్నారు. ఒకరు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, మరొకరు టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌. ఇప్పుడు ఈ జాబితాలో అజయ్‌ చేరారు. ఇప్పటికే అజయ్‌ దగ్గర బీఎండబ్ల్యూ, బెంజ్, టయోటా.. లాంటి ఎన్నో కార్లు ఉన్నాయి. ప్రస్తుతం అజయ్‌ బాలీవుడ్‌లో ‘మైదాన్‌’, మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.