ఫోర్బ్స్‌లో చోటున్నా సంతృప్తి లేదు

క్షయ్‌కుమార్‌ వయసుకి ఆయన బాడీ ఫిట్‌నెస్‌కి పోలికే ఉండదు. 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టంట్‌లుచేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు అక్షయ్‌. గతంలో ఫోర్బ్స్‌ జాబితాలో కూడా ఆయనకు చోటు దక్కింది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఎలాంటి పనైనా చేయడానికి ఆయన వెనుకాడరు. ఆయన ప్రస్తుతం లండన్‌లో కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారు. అక్కడ ఓ చోట ఓ వినూత్న పోటీ పెట్టారు. ‘వేలాడండి...గెలవండి’ అంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన వ్యవహారం కదా వెంటనే రాడ్‌ పట్టుకుని వేలాడారు అక్షయ్‌. ఈ విషయాన్ని ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించినా సంతృప్తి లేదు. 100 పౌండ్ల (సుమారు రూ.8500) కోసం ఇలా వేలాడుతున్నాడు’’ అంటూ రాసి ఆయన వేలాడుతున్న వీడియోను పంచుకున్నారు. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.