బిగ్‌బి 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నారట!!

‘‘నేను ప్రస్తుతం 25 శాతం లివర్‌ (కాలేయం)తోనే జీవిస్తున్నా’’నంటూ తన ఆరోగ్యానికి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌. తాజాగా ఆయన స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘‘ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. దాదాపు 8 ఏళ్ల పాటు నాకు క్షయ సోకిందనే విషయాన్ని గుర్తించలేకపోయా. రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోక పోవడం వల్లే ఇలా జరిగింది. ఫలితంగా అప్పటికే నా కాలేయంలో సగ భాగం చెడిపోయింది. ప్రస్తుతం నేను కేవలం 25 శాతం కాలేయంతోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. అందుకే ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒకటే. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను ముందుగానే గుర్తించి, ప్రారంభంలోనే సులభమైన చికిత్సల ద్వారా దాన్ని నివారించుకోగలుగుతాం’’ అని చెప్పుకొచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.