నాలుగేళ్ల తరువాత మళ్లీ బిపాసా

బాలీవుడ్‌ నటి బిపాసాబసు నాలుగేళ్ల విరామం తరువాత మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతోంది. తన భర్త కరణ్‌సింగ్‌ గ్రోవర్‌తో కలిసి ‘ఆదత్‌’ అనే చిత్రంలో నటించబోతోంది. భూషణ్‌ పటేల్‌ దర్శకత్వంలో రూపొందబోతోంది. మికాసింగ్‌ నిర్మిస్తున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఈ చిత్రం సెట్‌్్స పైకి వెళ్లబోతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ నేను నా పరిధిలో జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనుకొనే వ్యక్తిత్వం ఉన్న దాన్ని. సినిమా పరిశ్రమకు తగ్గట్టు ఉండటం నాకు చేతకాదు. సినిమా అనేది ఎంతో పెట్టుబడితో చేసే వ్యాపారం. సినిమా విజయవంతం కాకపోతే ఎలా అనే భయం ఉంటుందే తప్ప నాకున్న స్టార్‌డమ్‌ పోతుందనే బాధ ఉండదు. సినిమాకు తగ్గటు ఎలా ఉండాలో అలానే ఉంటాను’’ అన్నారు. గతంలో ఆమె కరణ్‌తో కలిసి నటించిన చిత్రం ‘ఎలోన్‌’.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.