బాలీవుడ్‌ జేజమ్మ?

2009లో ఒక దర్శక దిగ్గజం భారీ బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో గ్రాఫిక్స్‌ మయాజాలంగా రూపొందిచిన థ్రిల్లర్‌ చిత్రం ‘అరుంధతి’. పైగా ఇందులో కథానాయకుడు లేడు. అప్పటికి ఆమె అగ్ర కథానాయిక కూడా కాదు. కాని కథ మీద నమ్మకంతో దర్శకుడు కోడి రామకృష్ణ అనుష్క కథానాయికగా ‘అరుంధతి’ సినిమా రూపొందించి పెద్ద సాహసమే చేశారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.  రికార్డులు తిరగరాస్తూ వసూళ్లు సాధించిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌లో అవుతుందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అనుష్క పాత్రను ఏ బాలీవుడ్‌ భామ పోషిస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే అనుష్క శర్మ, కరీనా కపూర్‌ పేర్లు వినపడగా తాజాగా ఈ జాబితాలోకి దీపికా పదుకొనె  చేరింది. ఈ చిత్రంలో దీపికా నటించబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం దీపికా యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ‘చఫాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు ‘83’ సినిమాలో రణవీర్‌కు జోడిగా కనిపించనున్నారు. మరి దీపికా జేజమ్మగా కనిపిస్తారో లేదో తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.