‘చీట్ ఇండియా’ పేరు మారింది

నటుడు, గాయకుడు ఇమ్రాన్‌ హష్మి నటించిన చిత్రం ‘చీట్ ఇండియా’ పేరు మారింది. సీబీఎఫ్‌సీ చివరి నిమిషంలో అభ్యంతరం చెప్పడమే దీనికి కారణం. దీంతో ‘చీట్ ఇండియా’కు బదులుగా ‘వై చీట్‌ ఇండియా’గా పేరు మార్చారు. పేరును మార్చినట్లు చిత్ర నిర్మాత తనూజ్‌ గార్గ్‌ ఒక ప్రకటన చేశారు. ధ్రువీకరణ కోసం వెళ్లిన ఈ చిత్రాన్ని చూసిన పరిశీలన కమిటి సభ్యులు సినిమా పేరు ఇబ్బంది కరంగా ఉందని, ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉందని కాబట్టి టైటిల్‌ మార్చాలని సూచించారట. ఇప్పటికే ట్రయిలర్, టీవీ ప్రోమోలు ‘చీట్ ఇండియా’ పేరుతో విడుదలయ్యాయి. ఈ సినిమా జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.