మనుషుల్ని మార్చేందుకు ప్రయత్నిస్తా

జంతువుల విషయంలో మనషుల ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని అంటున్నాడు బాలీవుడ్‌ యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ జాన్‌ అబ్రహం. ‘మానవాళి అభివృద్ధి కోసం చెట్లను నరకడం, జంతువులను చంపడాన్ని సహించనని ప్రకృతిపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘ప్రజలను సరిదిద్దేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మన దేశంలో పిల్లలు కుక్కని చూసినపుడు అది కరుస్తుందని చెబుతారు తప్ప విశ్వాసంలో దానిని మించింది లేదని చెప్పరు. ఇలాంటి మనస్తత్వం మారాలి. జంతువులను వేటాడటం, వాటిని రాళ్లతో కొట్టడాన్ని నేను వ్యతిరేకిస్తాన’ంటున్నాడీ హీరో. ఇలా మాటలు చెప్పడమే కాదు.. అడవులను,జంతువులను సంరక్షించాల ఉద్దేశంతోనే కునాల్‌ అవంతి రూపొందించిన ‘ఐ యామ్‌ యానిమల్‌- అన్‌లీష్‌’ వీడియోలో కనిపించి అందరిని చైతన్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా నటించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.