‘కబీర్‌’కు ముందు 15కోట్లు.. ఇప్పుడేమో 35 కోట్లు!!

‘అ
ర్జున్‌రెడ్డి’తో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగిపోయారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడీ చిత్రాన్ని షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేయగా.. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు రూ.300 కోట్ల క్లబ్‌ను చేరే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పుణ్యమాని ఉత్తరాదిలో షాహిద్‌ క్రేజ్‌ కూడా ఒక్కసారిగా పెరిగిపోయిందట. దేవరకొండకు కెరీర్‌ తొలినాళ్లలోనే ఇలాంటి బ్లాక్‌బస్టర్‌ తగలగా.. షాహిద్‌కు బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇన్నేళ్లకు కానీ, ఇంత చక్కటి హిట్‌ పడలేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. షాహిద్‌ తనకు క్రేజ్‌ ఉన్నప్పుడే దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యాడట. ఈ నేపథ్యంలోనే తన తర్వాతి సినిమా కోసం పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట ఈ కబీర్‌. నిన్నమొన్నటి వరకు ఓ చిత్రానికి రూ.15 కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేసిన షాహిద్‌.. ‘కబీర్‌సింగ్‌’ హిట్‌తో దాన్ని రూ.35 కోట్ల వరకు పెంచేశాడట. ప్రస్తుతం తన వద్దకు క్యూ కడుతున్న దర్శక నిర్మాతలకు కూడా ఈ విషయాన్ని ముందుగానే చెప్పేస్తున్నాడట షాహిద్‌. ప్రాజెక్టు స్థాయిని బట్టీ రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఆయన డిమాండ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.