టాలీవుడ్‌ నుంచి.. హాలీవుడ్‌ లుక్‌లోకి!!


తెలుగు చిత్రసీమలో అత్యంత అందగాడు ఎవరంటే? ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్‌బాబు. నాలుగు పదుల వయసులో ఉన్నా నేటికీ యువతరం గుండెల్లో ఆయన రాజకుమారుడే. అయితే ఈ క్రేజ్‌ దక్షిణాదికి మాత్రమే పరిమితమైంది కాదు.. ఉత్తరాదిలోనూ మహేష్‌ కటౌట్‌కి పిచ్చ క్రేజ్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెటుకునే గతకొన్నాళ్లుగా ఆయన్ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు ఉత్తరాది దర్శక,నిర్మాతలు. ఇదిలా ఉంచితే తాజాగా మహేష్‌ ‘వోగ్‌ ఇండియా’ కవర్‌పేజిపై మెరిసిన సంగతి తెలిసిందే. ఇలా దక్షిణాది నుంచి వోగ్‌పై మెరిసే అవకాశం దక్కించుకున్న ఘనత మహేష్‌కు మాత్రమే చెల్లింది. ఈ వోగ్‌ కోసం ఆయన ఇచ్చిన రెండు స్టిల్స్‌ ఇప్పటికే బయటకు రాగా నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ సూపర్‌స్టార్‌కు సంబంధించిన మరికొన్ని ఫొటోలు నెట్టింట విడుదలయ్యాయి. ఇక వీటిలో మహేష్‌ లుక్స్‌ చూస్తే సూపరో సూపర్‌ అనకుండా ఉండలేరు సినీప్రియులు. అంత అదిరిపోయేలా స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు మహేష్‌. ఈ ఫొటోల్లో ఆయన్ని చూస్తుంటే ఇది బాలీవుడ్‌కు వెళ్లాల్సిన కటౌట్‌ కాదు.. నేరుగా హాలీవుడ్‌లోనే ఉండాల్సిన పర్సనాలిటీ అనిపిస్తుంది. నిజంగా ఇవి ఆయన అభిమానులకు మునుపెన్నడూ చూడని కనులవిందును అందిస్తున్నాయి. వీటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి మరి..



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.