జోరున వాన పడుతున్నా.. షూట్‌కు సైకిల్‌పై

ల్మాన్‌ ఖాన్‌ ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా సింప్లిసిటీ విషయంలో మిగతా నటీనటులకు ఎప్పుడూ స్ఫూర్తిగానే నిలుస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయన ఓ సాధారణ వ్యక్తిలా ముంబయి నగరంలో కాలి నడకనో, సైకిళ్లపైనో చక్కర్లు కొట్టడం తరచూ చూస్తునే ఉంటారు. అయితే తాజాగా ఆయన సైకిల్‌పై సవారీ చేస్తూ ముంబయి రోడ్లపై సందడి చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్‌ 3’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు కోసం ముంబయి రోడ్లపై ఓ సాధారణ వ్యక్తిలా సైకిల్‌పై వెళ్లారు సల్మాన్‌. ఓవైపు జోరున వాన కురుస్తున్నా రైన్‌ కోట్‌, చిన్న షార్ట్‌ ధరించి సైకిల్‌పై ఉత్సాహంగా దూసుకెళ్లారు సల్లూ భాయ్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.