బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే జవాబిస్తాడు

థానాయకులతో ఖాకీ తొడిగించి పక్కా యాక్షన్‌ చిత్రాలు తెరకెక్కించడంలో రోహిత్‌ శెట్టి దిట్ట. పోలీస్‌ కథలతో రూపొందిన ‘సింగం’ సిరీస్‌తో పాటు ఇటీవల వచ్చిన ‘సింబా’ రోహిత్‌ శైలికి అద్దంపట్టాయి. ఇప్పుడు మరోసారి హీరోను పోలీస్‌ పాత్రలో చూపించబోతున్నారాయన. అక్షయ్‌ కుమార్‌తో ‘సూర్యవంశీ’ పేరుతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు రోహిత్‌. అందులో అక్షయ్‌ ఉగ్రవాద నిరోధక బృందంలో పనిచేసే సూర్యవంశీ అనే శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. తాజాగా అక్షయ్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. యూనిఫామ్‌ మీద పోలీస్‌ జాకెట్‌ ధరించి చేతులో గన్ను పట్టుకుని ఉన్న అక్షయ్‌ గెటప్‌ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ మీదున్న ‘ఎ బుల్లెట్‌ ఫర్‌ ఎ బుల్లెట్‌’ అన్న క్యాప్షన్‌ను బట్టి ఇది సీరియస్‌ యాక్షన్‌ చిత్రమని అర్థమవుతోంది. మేలో సెట్స్‌ మీదకు వెళ్తున్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌తో కలసి రోహిత్‌ నిర్మిస్తున్నారు. ఇతర తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.