డెంగ్యూతో బాధపడుతున్న సుశాంత్‌!

‘కేదార్‌నాథ్‌’ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి ప్రస్తుతం బెడ్‌రెస్ట్‌ అవసరమని డాక్టర్లు చెప్పారట. కారణం ఏమిటంటే అతను డెంగ్యూ జర్వంతో బాధపడుతున్నాడని తెలిసింది. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ను కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అంతే కాదు మరికొన్ని ఈవెంట్స్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చిందట. సుశాంత్‌ ఈ మధ్య యూరప్‌లోనూ పర్యటించారు. విషయం తెలిసిన సుశాంత్‌ అభిమానులు అందోళన చెందుతున్నారట. సుశాంత్‌ సింగ్‌ ఈ నెల నవంబర్‌ 1 విడుదలైన ‘డ్రైవ్‌’ చిత్రంలో హీరోగా నటించారు. తరుణ్‌ సుఖాని దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌ కథానాయికగా నటించింది. ప్రస్తుతం సుశాంత్‌ ‘దిల్‌ బిచారా’ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.